రాజధాని అంశంలో వైసీపీ పై ఒత్తిడి తెస్తాం : సోము వీర్రాజు

రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గుంటూరు ఆటోనగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి.. లాడ్జి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

admin
Updated on: 17 Dec 2020 8:30 PM IST
రాజధాని అంశంలో వైసీపీ పై ఒత్తిడి తెస్తాం :  సోము వీర్రాజు
X

రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గుంటూరు ఆటోనగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి.. లాడ్జి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది బీజేపీ అభిప్రాయమన్న సోము.. రాజధానికి సమస్య రావడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే రాజధానిని పూర్తిచేసి ఉంటే ఇప్పుడు ఆయన దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేది కాదని ఎద్దేవా చేశారు.

admin

admin

Next Story