కర్నూలులో బీజేపీ నేత ఓవరాక్షన్‌.. హెచ్‌ఎంటీవీ ప్రతినిధిపై దాడికి యత్నం

* గణేష్‌ శోభాయాత్రలో ఘటన * హెచ్‌ఎంటీవీకి ఓ బీజేపీ నేత ఇంటర్వ్యూ ఇస్తుండగా మధ్యలో వచ్చి రిపోర్టర్‌ను తోసేసిన కపిలేశ్వరయ్య

Sandeep Reddy
Updated on: 22 Sept 2021 4:19 PM IST
BJP Leader Over Action on HMTV Reporter and Trying to Attack on HMTV Reporter
X

కర్నూలులో బీజేపీ నేత ఓవరాక్షన్‌.. హెచ్‌ఎంటీవీ ప్రతినిధిపై దాడికి యత్నం

Kurnool: క్రమశిక్షణకు మారు పేరు అయిన బీజేపీలో ఆయన ఓ ఉన్నత పదవిలో వున్న నేత.. అయితేనేం.. వీధిలో వీరంగం చేసాడు.. అది కూడా మీడియా ప్రతినిధి మీద మీడియా పై దాడి చేసి హీరో అనిపించుకోవాలని రెచ్చిపోయాడు.. ఇది చూసిన బీజేపీ నేతలు బిత్తరపోయారు. సదరు రెచ్చిపోయిన బీజేపీ నేత ఏకంగా ఏపీ బీజేపీ క్రమశిక్షణ సంఘం సభ్యులు కావటం మరో విశేషం.

ఆ నేత తీరుపై ఇప్పుడు సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. అలా ఆ బీజేపీ నేత రెచ్చిపోవటానికి కారణంపై ఇప్పుడు అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది. ఆ బీజేపీ లీడర్ ఏం చేసాడు. ఓ సారి మీరు చూడండి.

కర్నూలులో వినాయక శోభాయాత్ర సందర్భంగా బీజేపీ నేతతో HMTV ప్రతినిధి ఇంటర్వ్యూ తీసుకుంటున్న సమయంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కపిలేశ్వరయ్య చేసిన దాడి ఇది. వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న కపిలేశ్వరయ్య ఆ పార్టీకి కోవర్టుగా మారారని వారు బహిరంగంగానే చెబుతున్నారు.

ఇంటర్వ్యూ సమయంలో ఓ బీజేపీ నేత సీఎం జగన్ తీరును విమర్శించటం గమనించిన కపిలేశ్వరయ్య ఉద్దేశ్యపూర్వకంగానే HMTV ప్రతినిధిపై బహిరంగ దాడి చేసారని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు అంటున్నారు. బీజేపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడే ఆ నిబంధనలు పాటించకుండా మీడియాపై దాడి చేయటం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story