బీజేపీ సీనియర్‌ నేత కన్నా సంచలన వ్యాఖ్యలు

Arun Chilukuri
Published on: 6 Jan 2021 2:38 PM IST
బీజేపీ సీనియర్‌ నేత కన్నా సంచలన వ్యాఖ్యలు
X

రామతీర్థం ధర్మయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపడుతోంది. గుంటూరులో బీజేపీ నిరసనల్లో పాల్గొన్న బీజేపీ సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కలెక్టర్‌ స్థాయి అధికారుల సహకారంతో మత మార్పిడులు జరుగుతున్నాయని కన్నా అన్నారు. ప్రభుత్వ మద్దతుతోనే రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్నాయని కన్నా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 120కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని దాడులను ఖండిస్తున్న ప్రతిపక్షాలపై ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు కన్నా. 18 నెలల్లో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమన్న ఆయన రేపు మరోసారి బీజేపీ ఛలో రామతీర్థం యాత్ర చేపడుతున్నట్టు స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story