ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన సునీల్ దియోధర్

JanaSena, BJP Alliance: ఏపీలో పొత్తులపై బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్ క్లారిటీ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 22 Oct 2022 6:04 PM IST
BJP, JanaSena tie-up for Next Elections Says Sunil Deodhar
X

ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన సునీల్ దియోధర్

JanaSena, BJP Alliance: ఏపీలో పొత్తులపై బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ- జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. టీడీపీ కుటుంబ, అవినీతి పార్టీ అని టీడీపీతో తాము పొత్తు పెట్టుకోమన్నారు. గతంలో ఆపార్టీతో పొత్తుపెట్టుకొని చేదు అనుభవాలు చవిచూశామన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అడిగిన రోడ్‌ మ్యాప్‌పై అంతర్గంగా చర్చించుకుంటామన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవట్లేదన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఏపీలో ఓటు వేసిన ప్రజలకే వైసీపీ వెన్నుపోటు పొడుస్తోందని సునీల్ దియోధర్ విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story