logo
ఆంధ్రప్రదేశ్

BJP Ram Madhav Comments on AP Politics: సమిష్టి నాయకత్వంతో.. ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగాలి

BJP Ram Madhav Comments on AP Politics: సమిష్టి నాయకత్వంతో.. ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగాలి
X
bjp general secretary ram madhav interesting comments on ap politics
Highlights

BJP Ram Madhav Comments on AP Politics: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంద‌నీ. రాష్ట్రంలో బీజేపీ స‌మిష్టి నాయ‌క‌త్వంతో .. రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాలని సూచించారు

BJP Ram Madhav Comments on AP Politics: ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంద‌నీ. స‌మిష్టి నాయ‌క‌త్వంతో రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సూచించారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు కు శుభాభినందనలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రామ్ మాధవ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నా ను తీసేశారని, సోము వీర్రాజును పెట్టారని అనే వాద‌న స‌రికాద‌ని, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం కోసమే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.

2024లో ఏపీలో అధికారంలోకి రావడం అంత సులభం కాదన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో బిజెపి పని చేస్తుంది. వచ్చే నాలుగేళ్లలో బలమైన శక్తి గా బిజెపి ఎదుగుతుంది.. అందుకు కార్యాచరణ కూడా సిద్దమైంది. పొలిటికల్ బెన్ ఫిట్ ను సాధించేలా నాయకులు కృషి‌ చేయాలి. కేంద్రం మొత్తం దేశాన్ని చూసే వ్యవస్థ కాదు.. రాష్ట్రం లో పరిస్థితి బట్టి బిజెపి వ్యవహరించాలి. బీజేపీ రాజకీయాలు వంశపారంపర్య, స్వార్థ, పదవీ రాజకీయాలు కావన్నారు. బిజెపిలో అంతా ప్రణాళిక ప్రకారం విధానాలు సాగుతాయి. బిజెపి చరిత్ర లో వరుసగా రెండోసారి అధ్యక్షులు అయ్యింది అమిత్ షా మాత్రమేన‌ని అన్నారు. మ‌రి కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాల‌ను ఎవ్వ‌రూ చేప‌డుతారో వేచి చూడాల‌ని ఎద్దేవా చేశారు.

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చాలా పరిమితం

మూడు రాజధానుల ప్రభుత్వం నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించారు. కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ లు వస్తున్నాయి. విభజన తరువాత అమరావతి ని రాజధానిగా అభివృద్ధి చేయాలని చెప్పాం. చంద్రబాబు అమరావతి రాజధానిగా ప్రకటిస్తే కేంద్రం అభ్యంతరం చెప్పలేదు. నిధులు కేటాయించి ప్రోత్సహించాం.. యూనివర్సిటీ లు పెట్టాం. ఇప్పుడు మూడు రాజధానులు అంటే... కేంద్రం జోక్యం చాలా పరిమితం గా ఉంటుంది. ఒక్క రాజధాని అవినీతిపై ఎలా పోరాడామో, మూడు రాజధానుల అవినీతిపైనా పోరాడాలన్నారు. మంచిని మాత్రం మంచిగా చూడాలన్నారు. మంచి చేస్తే అంగీకరించాలని, తప్పు చేస్తే మాట్లాడాలని రామ్ మాధవ్ తెలిపారు. దేశంలో మూడు రాజధానులు ఎక్కడా లేవన్నారు. యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలోనూ ఒకే రాజధాని ఉందన్నారు. ఒక రాజధాని నిర్మాణం లో‌ అవినీతి ని బిజెపి ప్రశ్నించిందని, మూడు రాజధానుల పేరుతో మళ్లీ‌ అవినీతి చేస్తే బిజెపి పోరాడుతుందని అన్నారు. అయితే అమరావతి రైతులు, ప్రజలకు పూర్తి గా న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. ప్రస్తుతం కోర్ట్ పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు మనమూ చూద్దాం. రాజకీయాలు పూల పాన్పు కాదు... అధికార పార్టీ దురంహంకారాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. ప్రత్యర్ధులు పోటీ చేయకుండా పోలీసులను ఇంటికి పంపి బెదిరించిన వైనం ఎపి లోనే చూశామ‌ని విమ‌ర్శించారు.

ఎపి లో బిజెపి జూనియర్ పార్టనర్గా పని చేయడం వల్ల దెబ్బ తిన్నాం. డామినేట్ పార్టీ గా ఎదగాలంటే వీధుల్లో నిలబడి ప్రజా సమస్యలపై పోరాడాలని, పక్క పార్టీలపై చేతులు వేయడం మాని.. స్వతంత్రంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో అన్ని చోట్ల అధ్యక్ష నియామకం యేడాది క్రితం జరిగితే.. ఎపి లో కొంత జాప్యం జరిగింది. కన్నా నేతృత్వంలో ఎంతోమంది నాయకులు బిజెపి లో‌ చేరారు. నేడు బిజెపి కి నాయకత్వం లోపం లేదు... అందరూ కలిసి పని చేస్తే 2024కు అధికారంలోకి రావడం ఖాయమ‌ని అభిప్రాయ ప‌డ్డారు.

Web Titlebjp general secretary ram madhav interesting comments on ap politics
Next Story