Vijayawada: విజయవాడలో బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు అధ్యక్షతన సమావేశం

Vijayawada: తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి అత్యవసర భేటీ * తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తోంది -సోము వీర్రాజు

Sandeep Eggoju
Published on: 13 March 2021 1:24 PM IST
BJP Chief Somu Veerraju Presided Over the Meeting in Vijayawada
X

సోము వీర్రాజు (ఫైల్ ఇమేజ్)

Vijayawada: విజయవాడ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి అత్యవసరంగా భేటీ అయ్యామని అన్నారు సోము వీర్రాజు. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తోందని, గెలుపు దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు వీర్రాజు. బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పిన ఆయన కార్పొరేషన్‌, మున్సిపాల్టీల్లో అత్యధిక స్థానాలు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ సమయంలో అధికార వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడే ఛాన్స్‌ ఉందని, బీజేపీ గెలిచే స్థానాల్లో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సోము వీర్రాజు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story