Purandeswari: గవర్నర్‌ నజీర్‌ను కలిసిన బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి

Purandeswari: ఎన్నికల ఫలితాల రోజున అల్లర్లు జరగకుండా చూడాలని వినతి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 May 2024 9:42 PM IST
BJP Chief Purandeswari Meet Governor Abdul Nazeer
X

Purandeswari: గవర్నర్‌ నజీర్‌ను కలిసిన బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి

Purandeswari: గవర్నర్‌ నజీర్‌ను బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి కలిశారు. ఎన్నికల ఫలితాల రోజున అల్లర్లు జరగకుండా చూడాలని విన్నవించారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెచ్చారని తెలిపారు. ఆదాయం లేని కార్పొరేషన్‌ల ద్వారా అప్పులు తెచ్చారని చెప్పారు. ఉద్యోగులకు జీతాలివ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదన్నారు. ఆర్థిక అంశాలపై సీఎస్‌ నుంచి వివరణ తెప్పించాలని కోరామని తెలిపారు. తీసుకున్న అప్పులకు వడ్డీ, అసలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం..ప్రతినెలా చెల్లించాల్సిన వివరాలు అడిగామన్నారు పురందేశ్వరి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story