సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ, రాజకీయ ప్రముఖులు వీరే..

సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ, రాజకీయ ప్రముఖులు వీరే..
x
Highlights

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ వస్తోంది.

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ వస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ జగన్ కు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, తమిళనాడు మునిసిపల్ మంత్రి వేలుస్వామి, 15వ ఆర్ధిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, జార్ఖండ్ ఎంపీ అన్నపూర్ణాదేవి తదితరులు సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, దేవినేని అవినాష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు సీఎంను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లు వినూత్నంగా వీడియో సందేశం ద్వారా సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో.. 'మీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే ఈ క్ష‌ణం కోసం మే 23 నుంచి ఎదురు చూస్తున్నాం.

తొలిసారి ముఖ్య‌మంత్రిగా మీరు జ‌రుపుకునే ఈ వేడుక 30 ఏళ్లపాటు నిర్విఘ్నంగా కొన‌సాగాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నా. హ్యాపీ బ‌ర్త్ డే సీఎం సార్‌.' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఆంధ్రరాష్ట్ర ముద్దుబిడ్డ 5 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు అయిన మా వైఎస్ జగన్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. అంటూ ట్వీట్ చేశారు. 'ముఖ్య‌మంత్రిగా మీరు జ‌రుపుకునే ఈ పుట్టిన‌రోజు తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ పండ‌గ రోజు. పేద‌ల బ‌తుకుల్లో వెలుగులు నింపాల‌ని త‌పించే మీలాంటి నాయ‌కులు వెయ్యేళ్లు వ‌ర్థిల్లాలి.

హ్యాపీ బ‌ర్త్ డే సీఎం సార్‌' అంటూ చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని ట్వీట్ చేశారు. 'సమస్యలు ఎన్నయినా చెరగని మీ చిరునవ్వు ఒక స్ఫూర్తి రాజకీయం అంటే రంగు కాదు సామాన్యుడి నవరత్నం అని చూపిన మీ నాయకత్వం ఒక ఆదర్శం, బలహీనవర్గాల బలమైన స్వరం మహిళల రక్షాబంధంగా మీ జన్మదినం రాష్ట్రానికి మరింత శోభ చేకూర్చాలని ఆకాంక్షిస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు!' అంటూ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్వీట్ చేశారు. సినీనటులు భానుచందర్, చిత్రం శ్రీను, మంగ్లీ సత్యవతి తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories