Nellore: బర్డ్‌ఫ్లూ కలకలం.. 20 వేలకు పైగా కోళ్ల మృత్యువాత

Nellore: పొదలకూరు, కోవూరులో భారీగా చనిపోతున్న కోళ్లు

Jyothi
Published on: 16 Feb 2024 11:53 AM IST
Bird Flu Symptoms Identify Nellore District
X

Nellore: బర్డ్‌ఫ్లూ కలకలం.. 20 వేలకు పైగా కోళ్ల మృత్యువాత

Nellore: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. పొదలకూరు, కోవూరులోని కోళ్ల ఫామ్స్‌లో 20 వేలకు పైగా కోళ్లు మరణించాయి. అయితే శాంపిల్స్‌ను భోపాల్ ల్యాబ్‌కు పంపించారు అధికారులు. వారం క్రితం పంపించిన శాంపిల్స్ రిపోర్టులో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యింది. దీంతో నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పశు వైద్య ఇతర విభాగాల అధికారులతో కలెక్టర్ హరి నారాయణ్ సమీక్ష నిర్వహించారు. వ్యాధి తీవ్రత ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఇప్పటికే లక్షల రూపాయల్లో నష్టపోయామని కోళ్ల ఫామ్‌ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story