Bill Gates Visits AP RTGS Center: అమరావతిలో బిల్‌గేట్స్ సందడి.. ఏపీ ఆర్టీజీఎస్ సెంటర్ చూసి ఫిదా.. చంద్రబాబు విజన్‌పై ప్రశంసల జల్లు!

Bill Gates on RTGS: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శించారు.
Bill Gates on RTGS: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ సోమవారం వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పర్యటించిన ఆయన, పాలనలో సాంకేతికతను ఏపీ ప్రభుత్వం వినియోగిస్తున్న తీరును దగ్గరుండి పరిశీలించారు.
టెక్నాలజీ వినియోగంపై ఆరా:
ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవలను వేగవంతం చేస్తున్న విధానాన్ని సీఎం చంద్రబాబు బిల్‌గేట్స్‌కు వివరించారు. ముఖ్యంగా డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వినూత్న ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు చేరువవుతున్న తీరును చూసి గేట్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల అనుసంధానం, ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియపై ఆయన ఆరా తీశారు.
సంజీవని ప్రాజెక్టుపై ప్రత్యేక ప్రశంసలు:
చిత్తూరు జిల్లా కుప్పంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న 'సంజీవని' ప్రాజెక్టు పురోగతిని బిల్‌గేట్స్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ, ఏఐ (AI) ద్వారా అందిస్తున్న వైద్య సలహాలను అధికారులు వివరించగా.. "నైస్.. గ్రేట్ వర్క్" అంటూ ఆయన కొనియాడారు. బిపి, షుగర్ వంటి పరీక్షల డేటా నమోదు ప్రక్రియపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
కీలక అంశాలు:
ల్యాండ్ రికార్డుల భద్రత: భూ రికార్డుల భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ విధానాన్ని వాడుతున్నామని సీఎం వివరించారు.
అమరావతి నిర్మాణం: రాజధాని అమరావతి నిర్మాణ నమూనా, భవిష్యత్తు ప్రణాళికలను చంద్రబాబు వివరించగా, బిల్‌గేట్స్ అభినందనలు తెలిపారు.
వాట్సాప్ గవర్నెన్స్: ప్రజలకు నేరుగా ఫోన్ ద్వారానే ప్రభుత్వ సేవలు అందడం గొప్ప విషయమని గేట్స్ పేర్కొన్నారు.
పాలనలో కృత్రిమ మేధ (AI)ను అందిపుచ్చుకుని ప్రజారోగ్య సేవలను మెరుగుపరచాలన్న చంద్రబాబు విజన్‌ను బిల్‌గేట్స్ ప్రశంసించారు. ఈ పర్యటనతో ఏపీ టెక్నాలజీ హబ్‌గా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



