దళిత యువకుడి శిరోముండ‌నం కేసులో ఏడుగురిపై కేసు

దళిత యువకుడి శిరోముండ‌నం కేసులో ఏడుగురిపై కేసు
x
Highlights

విశాఖలోని పెందుర్తిలో దళిత యువకుడు శిరో ముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని విశాఖ సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. ఈ...

విశాఖలోని పెందుర్తిలో దళిత యువకుడు శిరో ముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని విశాఖ సీపీ మనీష్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. ఈ కేసులో నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. విశాఖ సీపీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నూతన్‌ నాయుడు భార్య మధుప్రియ, ఇంటి సహాయకులు వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధితుడిని కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టినట్టు సీసీటీవీ ఫుటేజిలో ఉందన్నారు. శిరోముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు.

విశాఖ నగర శివారులో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ నూతన్ నాయుడు ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పర్రి శ్రీకాంత్‌ (20)కు నాన్నమ్మ, చెల్లి ఉన్నారు. ఉపాధి కోసం విశాఖ తరలివచ్చాడు. సుజాతనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న నూతన్‌నాయుడి ఇంట్లో నాలుగు నెలల క్రితం పనికి కుదిరాడు. ఈ నెల 1న జీతం తీసుకుని పని మానేశాడు. తమ ఇంట్లో చోరీకి గురైన సెల్‌ఫోన్‌ గురించి మాట్లాడాలని నూతన్‌నాయుడు భార్య గురువారం రాత్రి శ్రీకాంత్‌ను ఇంటికి రప్పించారు. ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని బాధితుడిని పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేసి కొట్టడమే కాకుండా జుట్టు తొలగించేశారు. శ్రీకాంత్‌ మీడియా ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడంతో పెందుర్తి పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు.Show Full Article
Print Article
Next Story
More Stories