Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగాం సురేష్ బెయిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది.

Big Shock to YSRCP Leader Nandigam Suresh
X

Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగాం సురేష్ బెయిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. మరియమ్మ హత్య కేసులో ఆయన బెయిల్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఏపీ హైకోర్టు సురేష్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. 2020లో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ మరణించారు. ఈ కేసులో నందిగం సురేష్ 78వ నిందితులు. ఈ కేసులో ఆయనకు కోర్టు నవంబర్ 5న రిమాండ్ పొడిగించింది. దీంతో ఆయన గుంటూరు జైల్లో ఉన్నారు.

మరియమ్మ హత్య కేసులో అప్పట్లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయలేదు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కూడా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ కేసులో ఆయనను 45 ప్రశ్నలు వేసి సమాచారం సేకరించారని తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారని చెబుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story