కుప్పంలో కుప్పకూలిన చంద్రబాబు

X
కుప్పంలో కుప్పకూలిన చంద్రబాబు
Highlights
కుప్పంలో టీడీపీ కుప్పకూలింది. చంద్రబాబు ఘోర పరాభవం ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ జయభేరి కొనసాగించింది....
Arun Chilukuri18 Feb 2021 1:00 AM GMT
కుప్పంలో టీడీపీ కుప్పకూలింది. చంద్రబాబు ఘోర పరాభవం ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ జయభేరి కొనసాగించింది. టీడీపీ మద్దతు దారులు అధిక పంచాయతీల్లో డిపాజిట్లు కోల్పోయారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలుండగా 4 పంచాయతీలు మినహా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 73 చోట్ల వైసీపీ, 14 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచారు.
2013 పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 12 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మూడున్నర దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్న చంద్రబాబు నియోజకవర్గంలో ఇలా ఫలితాలు రావడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు చాలా చోట్ల టీడీపీ మద్దతుదార్లకు డిపాజిట్లు కూడా దక్కలేదు. గుడిపల్లి, కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోనూ వైసీపీ మద్దతుదార్లు జయభేరీ మోగించారు.
Web TitleBig shock To Chandrababu in Panchayat Election Results
Next Story