Yanam: గౌతమి గోదావరిలో పండుగప్ప చేప లభ్యం.. రూ.9వేలకు దక్కించుకున్న దంపతులు

Yanam: మత్స్యకారులకు వలకు చిక్కిన 15 కిలోల చేప

Shekhar G
Published on: 3 July 2023 12:13 PM IST
Big Barramundi Fish Caught In Yanam
X

Yanam: గౌతమి గోదావరిలో పండుగప్ప చేప లభ్యం.. రూ.9వేలకు దక్కించుకున్న దంపతులు 

Yanam: యానాం గౌతమి గోదావరిలో మత్స్యకారులకు పండుగప్ప చేప లభ్యమైంది. సముద్రపు చేపల రుచిలో రారాజుగా పేరొందిన 15 కిలోల పండుగప్ప చేప మత్యకారుల వలకు చిక్కింది. స్థానిక మార్కెట్‌లో ఈ చేపకు వేలం వేయగా... స్థానికంగా నివసించే పోనమండ భద్రం, రత్నం దంపతులు ఈ చేపను 9 వేల రూపాయలకు దక్కించుకున్నారు.. గోదావరిలో ఇంత భారీ పండుగప్ప చేప దొరకడం చాలా అరుదుగా జరుగుతుందని మత్స్యకారులు తెలిపారు...

గోదావరిలో దొరికే పండుగప్ప చేప మంచి రుచిగా ఉండడంతో మాంసప్రియులు దీన్ని కొనడానికి వేలం పాటలో పోటీ పడ్డారు... పండుగప్ప చేప దొరకడంతో మత్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు... శుభకార్యాల్లో పులస చేప తరహాలో పండుగప్ప చేప కూర, వేపుడు ముక్కల వంటకాన్ని మాంసప్రియులు ఇష్టంగా తింటారు.. పండుగప్ప చేప సముద్రపు ఉప్పు నీటిలో, మంచి నీటి నదుల్లో పెరగడం ప్రత్యేకతగా అని చెప్పారు మత్స్యకారులు..

Shekhar G

Shekhar G

Next Story