Bhuma Akhila Priya: ఇలాంటి సంస్కృతి నేను వినలేదు, చూడలేదు

Bhuma Akhila Priya: ప్రపంచంలో ఎక్కడ జరగని సంఘటన నంద్యాలలో చోటు చేసుకుంది

Dhatripriya
Published on: 25 May 2023 12:31 PM IST
Bhuma Akhila Priya Sensational Comments
X

Bhuma Akhila Priya: ఇలాంటి సంస్కృతి నేను వినలేదు, చూడలేదు

Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా... ఏవి సుబ్బారెడ్డి పై దాడి కేసులో అరెస్టు అయ్యి నిన్న కండిషన్ బెయిల్ తో భూమా అఖిలప్రియ విడుదలయ్యారు. సందర్భంగా నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి వచ్చారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. ఈమె స్టేషన్ కు రావడంతో టిడిపి నాయకులు ,అభిమానులు భారీగా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దేశంలో,ప్రపంచంలో ఎక్కడ జరగని సంఘటన నంద్యాలలో చోటు చేసుకుందన్నారు భూమా అఖిల ప్రియ. ఆడపిల్ల మీద దాడి చేసి ఆడపిల్ల మీద కేసుపెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆమె విమర్శించారు. ఇలాంటి సంస్కృతి నేను వినలేదు, చూడలేదు. రాష్ట్రాల్లో ఉన్న మహిళల పరిస్థితి ఏవిధంగా ఉందొ అర్థమవుతుందన్నారు భూమా అఖిల ప్రియ. ఈ సంఘటనపై ఎవరెవరి హస్తం ఉందని పూర్తి ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి తెలిపుతానన్నారు అఖిల ప్రియ.

Dhatripriya

Dhatripriya

Next Story