Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. జైలు నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలింపు

Bhuma Akhila Priya: ఛాతీలో నొప్పి కారణంగా ఈసీజీ పరీక్షలు చేసిన వైద్యులు రిపోర్టులు నార్మల్ గా రావడంతో మళ్ళీ జైలుకి తరలింపు

Jyothi
Published on: 19 May 2023 10:30 AM IST
Bhuma Akhila Priya shifted to hospital from jail due to Health Problem
X

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. జైలు నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలింపు

Bhuma Akhila Priya: మాజీ మంత్రి అఖిలప్రియను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు పోలీసులు. కర్నూలు లోని మహిళా సబ్ జైల్లో ఉన్న అఖిల గురువారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో జైలు సూపరింటెండెంట్ హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న అఖిలప్రియకు క్యాజువాలిటీలో ఈసీజీ పరీక్ష నిర్వహించి, ఆ వెంటనే కార్డియాలజీ విభాగానికి పంపించారు.

అక్కడ కూడా ఆమెకు ఈసీజీ, 2డి ఎకో పరీక్ష నిర్వహించారు. అన్ని రిపోర్టులు నార్మల్ గా రావటంతో తిరిగి జైలుకి పంపించారు. నంద్యాలలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు లోకేష్ పాదయాత్ర సంద‌ర్భంగా స్థానిక నాయకులు ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరులు దాడి చేశారు. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల పాటు రిమాండు‌కు పంపారు.

Jyothi

Jyothi

Next Story