Bhogi Festival 2022: తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి..

Bhogi Festival Celebrations in Telugu states
x

Bhogi Festival 2022: తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి..

Highlights

Bhogi Festival 2022: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది.

Bhogi Festival 2022: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. శుక్రవారం తెల్లువారుజాము నుంచే భోగి మంటలు వేయటంతో పండగ వాతావరణం సందడిగా మారింది. పలువురు రాజకీయ ప్రముఖులు వారి ఇళ్ల వద్ద భోగి మంటలు వేసి.. ప్రజలుకు భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రకాశం జిల్లా కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద భోగి సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో హీరో బాలకృష్ణ దంపతులు పాల్గొన్నారు. దగ్గుబాటి, బాలకృష్ణ దంపతులతో పాటు లోకేశ్వరి, ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున దగ్గుబాటి ఇంటి వద్దకు చేరుకున్నారు.

ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు నగరి ఎమ్మెల్యే రోజా. కడప జిల్లా శెట్టిపల్లిలో బంధువుల ఇంట్లో ఎమ్మెల్యే రోజా భోగిమంటలు వేసి సందడి చేశారు. ప్రతి ఒక్కరూ పల్లెలకు వెళ్లి పండుగ చేసుకోవాలని అన్నారు. సీఎం జగన్ పాలనలో అందరూ సుఖసంతోషాలతో ఉన్నారని తెలిపారు.

రాష్ట్రంలో యువత పెద్ద ఎత్తున భోగి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడలో భోగి వేడుకల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి కరోనా వైరస్ భోగి మంటల్లో ఆహుతి అవ్వాలని అన్నారు. సీఎం జగన్ ఏపీలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పండుగలను రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories