Gudivada Amarnath: జగన్ కష్టాన్ని తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారు

Gudivada Amarnath: జగన్ కష్టాన్ని తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారు
x
Highlights

Gudivada Amarnath: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో అసలైన క్రెడిట్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.

Gudivada Amarnath: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో అసలైన క్రెడిట్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ఈ ప్రాజెక్టును జగన్ తన చిత్తశుద్ధితో పట్టాలెక్కించారని ఆయన కొనియాడారు.

జగన్ హయాంలోనే కీలక అడుగులు:

భోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం అవసరమైన భూసేకరణ, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారం జగన్ హయాంలోనే జరిగాయని అమర్నాథ్ గుర్తు చేశారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసేందుకు జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.1,100 కోట్ల భారీ పరిహారాన్ని అందించిందని తెలిపారు.

2023 మే 3న జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, 2025 డిసెంబర్ నాటికి విమానాల రాకపోకలు ప్రారంభం కావాలని జీఎంఆర్ (GMR) సంస్థకు స్పష్టమైన గడువు విధించారని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబుపై విమర్శలు:

2019 ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టడానికే చంద్రబాబు హడావిడిగా శంకుస్థాపన చేశారని అమర్నాథ్ ఆరోపించారు.

ప్రాజెక్టుకు 2,700 ఎకరాలు అవసరమైతే, చంద్రబాబు తన హయాంలో కనీసం 250 ఎకరాలు కూడా సేకరించలేకపోయారని విమర్శించారు. జగన్ కష్టపడి నిర్మించిన ప్రాజెక్టును ఇప్పుడు తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories