Bharat Ratna: పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలంటున్న సీఎం జగన్

Bharat Ratna: పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్‌ లేఖ లేఖ రాశారు.

Kranthi
Updated on: 12 March 2021 5:12 PM IST
Bharat Ratna: Give Bharat Ratna to Pingali Venkaiah CM Jagan
X

ఇమేజ్ సోర్స్:(ది హన్స్ ఇండియా)

Bharat Ratna: ప్రధాని నరేంద్రమోడీకి సీఎం జగన్‌ మరో లేఖ రాశారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. పింగళి వెంకయ్యకు భారత రత్న ఇస్తేనే తగిన గుర్తింపు వస్తుందని తెలిపారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుగుతున్న సందర్భంలో జాతీయ పతాక రూపశిల్పికి భారత రత్న ఇవ్వడం సముచితమని పేర్కొన్నారు. గాంధీ సిద్దాంతాలతో స్వాతంత్ర్య పోరాటం చేసిన పింగళిని భారత రత్నతో సత్కరించాలని కోరారు. పింగళి వెంకయ్యకు ఇప్పటి వరకు సరైన గుర్తింపు లభించలేదని..సీఎం జగన్‌ వెల్లడించారు. కాగా.. ఇప్పటికే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పై ప్రధాని మోడీకి జగన్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story