సివిల్స్ సర్వీసెస్‌లో మెరిసిన నర్సీపట్నం యువకుడు

*ఆల్ ఇండియా స్థాయిలో 28వ ర్యాంకు సాధించిన భరద్వాజ్

Jyothi
Published on: 31 May 2022 1:34 PM IST
Bharadwaj Cracks Civil Services Exam 2021
X

సివిల్స్ సర్వీసెస్‌లో మెరిసిన నర్సీపట్నం యువకుడు

Narsipatnam: సివిల్ సర్వీసెస్‌లో నర్సీపట్నం తేజం మెరిసింది. మే 30న ప్రకటించిన సివిల్ సర్వీసెస్ 2022 ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో నర్సీపట్నానికి చెందిన భరద్వాజ్ అనే యువకుడు 28వ ర్యాంకులో నిలిచారు. 2017 నుంచి వరుసగా ఐదు సార్లు ప్రయత్నం చేసి, ఐదోసారి ఫలితం సాధించారు.

భరద్వాజ్ తండ్రి సత్యప్రసాద్ హైస్కూల్‌లో HMగా, తల్లి రాధాకుమారి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. వరంగల్ నీట్‌లో బీటెక్ పూర్తి చేసిన భరద్వాజ్ కొద్దికాలంగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. అనంతరం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మళ్లీ తన ప్రయత్నాన్ని కొనసాగించి, ఐదో దఫాలో జాతీయ స్థాయిలో 28వ ర్యాంకు సాధించారు.

Jyothi

Jyothi

Next Story