కడప జిల్లా ప్రొద్దుటూరులో బాలికపై అత్యాచారం.. పట్టించుకోని పోలీసులు...

Kadapa: రెండు స్టేషన్ లలో బాధితురాలిని విచారించినా నిందితులపై నమోదుకాని కేసులు...

Shireesha
Published on: 12 May 2022 12:48 PM IST
Beggar Girl Molestation in Kadapa District Police Ignored | AP Live News
X

Representational Image

Kadapa: కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కడప జిల్లా పొద్దుటూరులో బాలికపై గత కొంత కాలంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం వీధిలోని మసీదు వద్ద బాలిక భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. తల్లి చనిపోయిన సదరు బాలిక తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్నాడు.

అయితే ఆ బాలికపై అదే వీధిలో ఉంటున్న యువకుడి కన్నుపడింది. ఆ యువకుడు, తన స్నేహితులతో కలిసి గత కొంత కాలంగా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక గర్భం దాల్చడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామ సచివాలయ పోలీస్.. బాధితురాలిని పీఎస్‌కు తీసుకొచ్చిన ఫలితం దక్కలేదు. రెండు స్టేషన్ లలో బాధితురాలిని విచారించినా నిందితులపై కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story