Lambasingi: సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్న మంచు మేఘాలు

Lambasingi: నిన్న అత్యల్పంగా 4.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

Jyothi
Published on: 26 Dec 2022 10:05 AM IST
Beautiful View of Snow Clouds in Lambasingi
X

Lambasingi: సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్న మంచు మేఘాలు

Lambasingi: అల్లూరి జిల్లా లంబసింగిలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. నిన్న అత్యల్పంగా, 4.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఏజెన్సీ ప్రాంతాలను మంచు పొరలు కమ్మేస్తున్నాయి. లోయలు పాలపొంగులా కనిపిస్తూ అలల్లా తేలియాడిపోయే మంచు మేఘాలు.. సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. మన్యం మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.

Jyothi

Jyothi

Next Story