అనంతపురం ఎర్రబండ గ్రామంలో మహిళపై ఎలుగుబంటి దాడి

Anantapur: ఎలుగుబంటి దాడిలో మహిళకు తీవ్రగాయాలు

Jyothi
Published on: 1 July 2022 1:11 PM IST
Bear Attack on Women in Ananthapur District
X

అనంతపురం ఎర్రబండ గ్రామంలో మహిళపై ఎలుగుబంటి దాడి

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్లు కలకలం రేపుతున్నాయి. ఏదో ఒక ప్రాంతంలో మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా కంబదూరు మండలం ఎర్రబండ గ్రామంలో ఒక మహిళపై ఎలుగుబంటి దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున మహిళ బహిర్భుమికి వెళ్తున్న సమయంలో.. మహిళపై ఎలుగుబంటి హఠాత్తుగా దాడి చేసింది. చుట్టుపక్కల ఉన్న వారు గట్టిగా కేకలు వేయడంతో కొండ ప్రాంతం వైపు ఎలుగుబంటి పరుగులు పెట్టింది.

మహిళకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామేశ్వరమ్మ కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధిత మహిళ వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని... బాధిత మహిళకు పరిహారం అందేలా చూస్తామని ఫారెస్ట్ ఆఫీసర్ వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story