శ్రీశైలంలో బయలు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు

Srisailam Temple: శ్రీశైలం రాలేని భక్తుల సౌకర్యార్థం .. అందుబాటులో ఆన్‌లైన్ ద్వారా పరోక్షసేవ పూజలు

Jyothi
Published on: 27 Aug 2022 8:35 AM IST
Bayalu Veerabhadra Swamy Special Pooja In Srisailam Temple
X

శ్రీశైలంలో బయలు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు

Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో... అమావాస్యను పురస్కరించుకొని శ్రీశైల క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామికి విశేషపూజలు నిర్వహించారు. శ్రీశైలంలో ఆన్‌లైన్‌లో పరోక్షసేవగా వీరభద్రస్వామికి పూజలు నిర్వహించుకునేందుకు.... దేవస్థానం ఈవో లవన్న భక్తులకు వెసులుబాటు కల్పించారు. ఈ సేవతో భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో.. ఈ రోజు జరిగిన వీరభద్రస్వామి ఆర్జిత పరోక్షసేవలో తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా... దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఈసేవలో పాల్గొన్నారు. పలు కారణాల దృష్ట్యా శ్రీశైలం రాలేని భక్తుల సౌకర్యార్థం... ఆన్‌లైన్ ద్వారా పరోక్షసేవ పూజలను అందుబాటులోకి తెచ్చామని ఆలయ ఈవో లవన్న తెలిపారు.

Jyothi

Jyothi

Next Story