బండ్ల గణేష్‌కు 14 రోజులు రిమాండ్‌

బండ్ల గణేష్‌కు 14 రోజులు రిమాండ్‌
x
Highlights

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కడప కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో వచ్చే నెల 4వ తేదీ ఆవరకు ఆయన రిమాండ్ లో...

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కడప కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో వచ్చే నెల 4వ తేదీ ఆవరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు. జడ్జి సూచన మేరకు బండ్ల గణేష్ ను పోలీసులు కడప జైలుకు తరలించారు. కడపకు చెందిన మహేశ్ అనే వ్యక్తి నుంచి బండ్ల గణేష్ 2011లో రూ. 13 కోట్ల అప్పు తీసుకున్నారు. డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో 2013లో గణేశ్ పై మహేశ్ చెక్ బౌన్స్ కేసు నమోదయింది.

ఈ నేపథ్యంలో అతనిపై కడప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, కోర్టు విచారణకు గణేశ్ హాజరుకాకపోవడంతో కడప జిల్లా మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో, బండ్ల గణేశ్ ను అదుపులోకి తీసుకొని గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి కడపకు తీసుకువచ్చి జిల్లా మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు.. ఈ నేపథ్యంలో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. మరోవైపు ఈ నెల 5న బండ్ల గణేష్‌ తన అనుచరులతో కలిసి వైసీపీ నాయకుడు పొట్లూరి వరప్రసాద్‌ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశాడనే ఆరోపణలతో గణేష్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories