Bandaru Satyanarayana: వైసీపీ నేతలతో టచ్‌లోకి బండారు సత్యనారాయణ..?

Bandaru Satyanarayana: ఆయనకు ఇచ్చేందుకే ఎంపీ సీటు పెండింగ్ పెట్టినట్లు సమాచారం

Shashank Gullapelli
Published on: 18 March 2024 2:39 PM IST
Bandaru Satyanarayana Is In Touch With YCP Leaders?
X

Bandaru Satyanarayana: వైసీపీ నేతలతో టచ్‌లోకి బండారు సత్యనారాయణ..?

Bandaru Satyanarayana: విశాఖ టీడీపీలో ముసలం రేగింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అనకాపల్లి ఎంపీ సీటు ఆయనకే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే బండారు సత్యనారాయణ వైసీపీలో చేరితే అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెక్ పెట్టవచ్చనే యోచనలో ఫ్యాన్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. బండారు సత్యనారాయణ, అచ్చెన్నాయుడి కుటుంబం వియ్యంకులు కావడంతో అనకాపల్లిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అయితే ఇదంతా పొలిటికల్ లీక్స్ అని ప్రచారం జరుగుతోంది. స్వతహాగా ధ్రువీకరించే వరకు అసలు విషయాలు బయటకు రావంటూ నేతలు చర్చించుకుంటున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story