Balineni Srinivasa Reddy: ఇవాళ సీఎం జగన్‌తో బాలినేని భేటీ..

Balineni Srinivasa Reddy: మధ్యాహ్నం 3 గంటలకి సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ

Jyothi
Published on: 1 Jun 2023 11:11 AM IST
Balineni Srinivasa Reddy To Meet CM YS Jagan Today
X

Balineni Srinivasa Reddy: ఇవాళ సీఎం జగన్‌తో బాలినేని భేటీ..

Balineni Srinivasa Reddy: సీఎం జగన్‌తో బాలినేని భేటీ ఉత్కంఠ రేపుతోంది. అసంతృప్తిలో ఉన్న మాజీ మంత్రి బాలినేనికి ఏపీ సీఎంవో నుంచి పిలుపు రావడంతో.. భేటీలో ఎలాంటి చర్చ జరుగుతుందనే ఆసక్తి నెలకొంది. మంత్రి పదవి కోల్పోయి అసంతృప్తిలో ఉన్న బాలినేని.. ఇటీవల రీజినల్ కో ఆర్డినేటర్ పదవికి కూడా రాజీనామా చేశారు. తాను ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటానని స్పష్టం చేశారు. ఈ విషయంపై గతంలో సీఎం జగన్‌ బుజ్జగించినా బాలినేని వెనక్కి తగ్గలేదు. అయితే మరోసారి బాలినేనికి సీఎంవో నుంచి పిలుపు రావడంతో ఆయనకు మళ్లీ కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నారా అనే చర్చ మొదలైంది.

Jyothi

Jyothi

Next Story