ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్‌

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్‌
x
Highlights

అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవిని జగన్ గతంలో అవమానించారని, కలిసేందుకు కూడా ఇష్టపడలేదని,...

అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవిని జగన్ గతంలో అవమానించారని, కలిసేందుకు కూడా ఇష్టపడలేదని, నిలదీయంతోనే కలిశారని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కామినేని ఉదాహరణను బాలకృష్ణ తప్పుబట్టారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగి వచ్చారన్నది అబద్ధమని చెప్పారు. ఎవరూ గట్టిగా అడగలేదని తెలిపారు. అయితే తనను కూటమి ప్రభుత్వం కూడా అవమానించిందని మండిపడ్డారు. ఎఫ్డీసీ సమావేశంలో తన పేరు తొమ్మిదివ స్థానంలో పెట్టారని, ఆ లిస్ట్ తయారు చేసింది ఎవరంటూ ప్రశ్నించారు. తనకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేకు ఫోన్ చేసి అడిగానని బాలకృష్ణ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories