MLA Balakrishna: రాష్ట్రంలో రాజకీయ కక్షలు.. దాడులు తప్ప అభివృద్ధి లేదు : బాలకృష్ణ

Arun Chilukuri
Updated on: 31 Aug 2020 6:00 PM IST
MLA Balakrishna: రాష్ట్రంలో రాజకీయ కక్షలు.. దాడులు తప్ప అభివృద్ధి లేదు : బాలకృష్ణ
X

MLA Balakrishna: రాష్ట్రంలో అభివృద్ధి సన్నగిల్లిందని.. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు పెరిగాయని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. నేడు ఆయన హిందూపురం ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రికి 55 లక్షల రూపాయల విలువ చెసే వైద్య పరికరాలను అందజేశారు. రాజధాని లేకున్నా టీడీపీ హయాంలో తెలంగాణ కన్నా అధిక ఆదాయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో అందరూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని బాలకృష్ణ పేర్కొన్నారు. కష్ట కాలంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలన్నారు. హిందూపురం అభివృద్ధి కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని బాలకృష్ణ అన్నారు. ఈ విషయంలో అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి కూడా తాను సిద్ధమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం అభివృద్ధిపై చర్చించేందుకు సీఎం జగన్‌ను ఇప్పటికే రెండుసార్లు అపాయింట్‌మెంట్‌ కోరానని మరోసారి సమయం అడిగి సీఎంను కలుస్తానని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story