Balakrishna: మా కుటుంబం జోలికొస్తే సహించేది లేదు.. ఖబడ్దార్

చంద్రబాబు చాలా ధైర్యంగా ఉండే మనిషి : బాలకృష్ణ చంద్రబాబు ఎప్పుడూ కంటతడి పెట్టలేదు

Sandeep Reddy
Published on: 20 Nov 2021 1:37 PM IST
Balakrishna Fires on YSRCP Leaders About Issue of Chandrababu
X

Balakrishna: మా కుటుంబం జోలికొస్తే సహించేది లేదు.. ఖబడ్దార్

Balakrishna: టీడిపి అధినేత చంద్రబాబు కుటుంబంపై వైఎస్ఆర్సీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తాజాగా స్పందించాడు. చంద్రబాబు ఏడవడం ఎప్పుడూ చూడలేదని.. అసెంబ్లీలో వేదికగా వ్యక్తిగత దూషణలు సరికాదని, తన సోదరిపై వ్యక్తిగత విమర్శలు సరికావని అన్నాడు. మనం అసెంబ్లీ లో ఉన్నామా పశువుల కొట్టంలో ఉన్నామా అర్ధమవట్లేదని అన్నారు.

సవాళ్ళు, ప్రతి సవాళ్ళ వరకు ఓకే కాని ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని, ఇలానే కొనసాగితే భరతం పడతామని బాలకృష్ణ అన్నారు. ఆడవాళ్ల జోలికొస్తే చేతులు కట్టుకొని కూర్చోమని మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తామన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు. చంద్రబాబుపై దాడులకు యత్నించినా సంయమనంతో ఉన్నాం. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదని బాలకృష్ణ వైసిపీ నేతలపై ఫైర్ అయ్యాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story