జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్

విచారణ చేపట్టిన 8వ అదనపు జిల్లా న్యాయస్థానం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 May 2024 9:21 PM IST
Bail Petition Of The Accused In The Case Of Stone Attack On Jagan
X

జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. 8వ అదనపు జిల్లా న్యాయస్థానంలో నిందితుడి తరఫు న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీశ్‌ను పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వెల్లడించే అవకాశముంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story