అఖిలప్రియ బెయిల్‌, కస్టడీ పిటిషన్‌పై ఉత్కంఠ

అఖిలప్రియ బెయిల్‌, కస్టడీ పిటిషన్‌పై ఉత్కంఠ
x
Highlights

-బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో నేడు కస్టడీ.. -బెయిల్‌ పిటిషన్‌పై తుది తీర్పు ఇవ్వనున్న సికింద్రాబాద్‌ కోర్టు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ బెయిల్‌, కస్టడీ పిటిషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ కస్టడీ, బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్ట్‌ తుదితీర్పు ఇవ్వనున్నారు. అఖిలప్రియ హెల్త్‌ బులెటిన్‌ను చంచల్‌గూడ జైలు అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. అఖిలప్రియకు చంచల్‌గూడ జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు.

అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ ఇంకా పరారీలోనే ఉన్నారు. అఖిలప్రియను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు. అయితే పోలీస్‌ కస్టడీ అనుమతి ఇవ్వకుండా.. బెయిల్‌ ఇవ్వాలని అఖిలప్రియ తరఫున న్యాయవాదులు వాదించారు. ఇరువురి వాదనలు విన్న సికింద్రాబాద్‌ కోర్ట్‌.. నేడు కస్టడీ, బెయిల్‌ పిటిషన్‌పై తుది ఆదేశాలు ఇవ్వనుంది కోర్టు.


Show Full Article
Print Article
Next Story
More Stories