సీఎం జగన్‌ పై దాడి కేసులో నిందితుడికి బెయిల్

జైలు నుండి విడుదలైన నిందితుడు నిందితుడు సతీష్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Jun 2024 3:48 PM IST
Bail for the accused in the case of attack on CM Jagan
X

సీఎం జగన్‌ పై దాడి కేసులో నిందితుడికి బెయిల్ 

సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో నిందితుడు వేముల సతీష్‌ జైలు నుండి విడుదలయ్యారు. శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులకు అందుబాటులో ఉండాలని కోర్టు కండిషన్ విధించింది. ఏప్రిల్ 13న విజయవాడ అజిత్ నగర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో వేముల సతీష్ నిందితుడిగా ఉన్నారు. కోత్తి కత్తి కేసు తరహాలో అమాయకుడైన సతీష్‌ను ఈ కేసులో ఇరికించారని డిఫెన్స్ లాయర్ సలీం సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పై సతీష్ దాడిచేసినట్లు పోలీసులు నిరూపించలేకపోయారని...సతీష్‌ను ఎక్కువ రోజులు జైలులో పెట్టించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారన్నారాయన.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story