Badvel ByPoll: ముగిసిన ప్రచారం.. ఈసీ కీలక ఆదేశాలు..

Badvel ByPoll: కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు.

Arun Chilukuri
Published on: 27 Oct 2021 8:44 PM IST
Badvel ByPoll Election Campaign Ends
X

Badvel ByPoll: ముగిసిన ప్రచారం.. ఈసీ కీలక ఆదేశాలు..

Badvel ByPoll: కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపారు. ఈ నెల 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు. నియోజకవర్గంలో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రచార పర్వం ముగియగానే ఈసీ కీల ఆదేశాలు జారీ చేసింది. బయటి వ్యక్తులు బద్వేలు నియోజకవర్గంలో ఉండ కూడదని ఈసీ స్పష్టం చేసింది.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతాధికారులకు నిర్దేశించింది. మరోవైపు బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 15వేల 292 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో లక్షా 7వేల 355 మంది మహిళా ఓటర్లు కాగా లక్షా 7వేల 915 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మరో 22 మంది ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story