Badvel By - Election: బద్వేల్ ఉప ఎన్నికకు నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

Badvel By - Election 2021: * అక్టోబర్ 30న బద్వేల్ ఉప ఎన్నికకు పోలింగ్ * బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా దాసరి సుధ పోటీ

Arun Chilukuri
Published on: 1 Oct 2021 10:34 AM IST
Badvel By-Election Nominations Filing Starting Today October 01 2021 | AP Live News Updates
X

Badvel By- Election: బద్వేల్ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్(ఫోటో- ది హన్స్ ఇండియా)

Badvel By - Election 2021: ఏపీలోనూ ఉప ఎన్నిక హడావుడి మొదలైంది. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానం ఉన ఎన్నికకు నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక నవంబర్ 2న ఫలితాలు ప్రకటిస్తారు. ఈసారి ఈవీఎంల ద్వారా ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో బహిరంగ సభకు వెయ్యి మందికి ఎక్కువ అనుమతించబోమని రిటర్నింగ్ అధికారి తెలిపారు.

కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఈ ఏడాది మార్చిలో కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయాత్నాలు మొదలుపెట్టాయి. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈ ఉప ఎన్నికల్లో విజయం తమదేనని వైసీపీ ధీమాగా ఉంది. ఇక ఆ పార్టీ నుంచి వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఓబుళాపురం రాజశేఖర్ బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ మాత్రం జనసేనతో చర్చించి అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో పడింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story