సరైన వైద్యం ఇప్పించలేక.. శిశువు చనిపోయాడని ఆగ్రహం

* పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

R Tripura Malini
Published on: 12 Dec 2022 8:47 AM IST
Baby Died Without Proper Treatment
X

సరైన వైద్యం ఇప్పించలేక.. శిశువు చనిపోయాడని ఆగ్రహం

Ananthapur: గర్భిణిగా ఉన్న భార్యకు సరైన వైద్యం ఇప్పించలేదని అనంతపురం జిల్లా తాడిపత్రిలో మసూం వలీ, మరో ఇద్దరిపై భార్య తరఫు బంధువులు దాడి చేశారు. సరైన వైద్యం ఇప్పించకపోవడం వల్లే శిశువు చనిపోయాడని ఆగ్రహించిన భార్య తరఫు బంధువులు భర్త మసూం వలీ, బావలు మహబూబ్‌బాషా నూర్, మహమ్మద్‌లపై దాడికి పాల్పడ్డారు.

తాడిపత్రి పట్టణం గాంధీనగర్‌కు చెందిన మసూం వలీకి ఇదే పట్టణానికి చెందిన రిజ్వానాతో వివాహమైంది. మసూం వలీ భార్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినా శిశువు పురిట్లోనే కన్నుమూశాడు. శిశువును చూడటానికి వచ్చిన తల్లి, అత్త ఒకేసారి రావడంతో వీరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన యువకులు బావ మసూం వలీ, మహబూబ్ బాషా, నూర్ మహమ్మద్‌లపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ముగ్గురూ గాయపడ్డారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story