Srikakulam: శ్రీకాకుళంలో ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌

Srikakulam: సైకిల్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

Rama Rao
Updated on: 3 Jun 2022 1:36 PM IST
Azadi Ka Amrit Mahotsav is Celebrated in Srikakulam | AP News
X

Srikakulam: శ్రీకాకుళంలో ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌

Srikakulam: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శ్రీకాకుళంలో వరల్డ్‌ బైసైకిల్‌ డేను ఘనంగా నిర్వహించారు.ప్రపంచ సైకిల్ డే సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం నుండి ఏడు రోడ్ల కూడలి వరకూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎంపి రామ్మోహన్‌ నాయుడు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో భారీ ఎత్తున స్థానిక యువకులు పాల్గొన్నారు.

ర్యాలీలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎస్పీ రాధిక, కలెక్టర్‌ శ్రీకేష్‌ సైకిల్‌ తొక్కి గ్రామస్తులను ఆకట్టుకున్నారు. ప్రతీ వ్యక్తి సైకిల్ వాడకం వల్ల పర్యావరణ పరిరక్షణ కు కృషి చేసినట్లే నని ఎం.పి. రామ్మోహన్నాయుడు అన్నారు.ప్రస్తుతం పరిస్థితిలో పొల్యూషన్ రోజు రోజుకి పెరుగుతుందని దీనిని అరికట్టాలంటే సైకిల్ వాడకమే మంచిందన్నారు రామ్మోహన్‌ నాయుడు.


Rama Rao

Rama Rao

Next Story