అయ్యన్నపాత్రుడుకు హైకోర్టులో ఊరట

Ayyanna Patrudu: తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇంటి జోలికి వెళ్లొద్దని ఆదేశం

Jyothi
Updated on: 20 Jun 2022 7:00 AM IST
Ayyanna Patrudu House Issue Creates Political Heat
X

అయ్యన్నపాత్రుడుకు హైకోర్టులో ఊరట

Ayyanna Patrudu: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇంటిజోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నర్సీపట్నంలో ఇల్లు కూల్చివేతపై అయ్యన్న పాత్రుడు హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయ్యన్న పాత్రుడి తరఫున న్యాయవాది సతీష్‌ వాదనలు వినిపించారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నీటిపారుదల శాఖకు చెందిన స్థలం ఆక్రమించారనే ఆరోపణలతో అయ్యన్న పాత్రుడి ఇంటి గోడను ఆదివారం మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. దీంతో అయ్యన్నపాత్రుడి ఇంటివద్ద ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఈ వ్యవహారంలో అయ్యన్న పాత్రుడి రెండో కుమారుడు చింతకాయల రాజేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో భారీగా టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆయన కుటుంబానికి మద్దతుగా నిలిచారు.

Jyothi

Jyothi

Next Story