Ayyanna Patrudu: ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు.. లక్షల్లో నేనొక్కడిని

Ayyanna Patrudu Comments On Ganta Srinivasa Rao
x

Ayyanna Patrudu: ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు.. లక్షల్లో నేనొక్కడిని 

Highlights

Ayyanna Patrudu: ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు.. లక్షల్లో నేనొక్కడిని

Ayyanna Patrudu: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావుపై అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు..! లక్షల్లో నేనొక్కడిని అంటూ సంచలన కామెంట్లు చేశారు.. గంటా ఏమైనా పెద్ద నాయకుడా..? ప్రధానా..? అంటూ ప్రశ్నించిన ఆయన.. పార్టీలో అందరూ రావాలి.. పని చేయాలన్నారు.. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక అని స్పష్టం చేశారు.. మేం ఎవ్వరికీ వ్యతిరేకులం కాదు.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలనే మేం కోరుకుంటున్నామన్న ఆయన.. అలా అండగా ఉండని వారిని చూస్తేనే మాకు బాధేస్తుందన్నారు.. మాకు అందరూ కావాలి. పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నవాళ్లు కూడా బాగుండాలనే కోరుకుంటామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories