తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అవంతి శ్రీనివాస్, కోన రఘుపతి

X
Highlights
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
admin22 Oct 2020 10:36 AM GMT
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం స్వామి వారి దర్శన విషయంలో ప్రక్క రాష్ట్రాల పర్యాటక భక్తులకు అన్ని వసతులను కల్పిస్తామని టీటీడీ అధికారులు చెప్పినట్లు అవంతి శ్రీనివాస్ తెలిపారు. టూరిస్టులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మంత్రి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. వీలైనంత త్వరగా కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని భగవంతుడిని ప్రార్ధించినట్లు రఘపతి తెలిపారు. అటు గజల్ శ్రీనివాస్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Web TitleAvanthi srinivas and kona raghupathi visits tirumala
Next Story