Anantapur: అనంతపురం జిల్లాలో ఆటో లారీ ఢీ.. స్పాట్‌లో ఐదుగురు మృతి...

Anantapur: మృతులు కోప్పలకొండ గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు..

Shireesha
Published on: 5 Nov 2021 9:00 AM IST
Auto Lorry Accident in Anantapur District | AP Latest News
X

Anantapur: అనంతపురం జిల్లాలో ఆటో లారీ ఢీ.. స్పాట్‌లో ఐదుగురు మృతి...

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిపై ఆటో లారీ ఢీ కొన్నాయి. పామిడి సమీపంలోని పంజాబీ డాబా వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. 10మందికి గాయాల కాగా ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతిచెందింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6కి చేరింది. మృతులు గార్లదిన్నె మండలం కోప్పలకొండ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story