Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం
Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సంగం కొండ మలుపు సమీపంలోని బీరాపేరు వాగు వంతెన వద్ద ఓ ఆటోను లారీ ఢీకొట్టింది.
Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం
Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సంగం కొండ మలుపు సమీపంలోని బీరాపేరు వాగు వంతెన వద్ద ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోయింది. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా ఐదుగురు గల్లంతయ్యారు. మరో ఆరుగురిని స్థానికులు సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. సంగమేశ్వర ఆలయానికి వెళ్తుండగా ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గల్లంతైనవారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి.
Next Story




