మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వృద్ధురాలిని..

Auto Driver Rescues an Elderly Woman who Wants to Commit Suicide
x

మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వృద్ధురాలిని..

Highlights

Auto Driver: ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలిని కాపాడి మానవత్వం చాటాడు ఓ ఆటో డ్రైవర్.

Auto Driver: ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలిని కాపాడి మానవత్వం చాటాడు ఓ ఆటో డ్రైవర్. గుంటూరు జిల్లా అనుపాలెం గ్రామానికి చెందిన చల్లా వెంకటమ్మ పిడుగురాళ్ళలో ఆటో ఎక్కి అనుపాలేం గుడి వద్ద దిగి ఏడుస్తూ కాలువ మీదుగా వెళ్తుండగా అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ అడ్డుకున్నాడు. ఆ తరుణంలో అటుగా వెళ్తున్న రాజుపాలెం జెడ్పీటీసీ సునీత రెడ్డి వివరాలు కనుక్కొని వృద్ధురాలిని పిడుగురాళ్ల పట్టణ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. పట్టణ సీఐ ప్రభాకరరావు వెంటనే సమస్యను రాజుపాలెం ఎస్ఐ అమీర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ వృద్ధురాలి కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories