కొండపై టెన్షన్.. టెన్షన్ : బాబు రావడానికి ముందే గుడికి తాళం వేసిన అధికారులు

కొండపై టెన్షన్.. టెన్షన్ : బాబు రావడానికి ముందే గుడికి తాళం వేసిన అధికారులు
x
Highlights

రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండపై టెన్షన్.. టెన్షన్‌గా మారింది. రామతీర్థం గుడిని దర్శించకుండానే చంద్రబాబు వెనుతిరిగారు. సమీపంలోని...

రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండపై టెన్షన్.. టెన్షన్‌గా మారింది. రామతీర్థం గుడిని దర్శించకుండానే చంద్రబాబు వెనుతిరిగారు. సమీపంలోని కోనేరును పరిశీలించారు. బాబు రావడానికి ముందే అధికారులు గుడికి తాళం వేసినట్లు తెలుస్తోంది. దీంతో పుజారులను అడిగి ఘటనపై చంద్రబాబు ఆరా తీశారు. విగ్రహం ధ్వంసం అయిన ప్రదేశంను బాబు పరిశీలించి సుమారు 15నిమిషాలు చంద్రబాబు కొండపైనే గడిపారు. రామతీర్థం రగడలో టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా తలపడ్డాయి. విజయసాయిరెడ్డి, వైసీపీ ప్రదర్శనను టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. రామతీర్థానికి టీడీపీ శ్రేణులు వేలాది తరలివచ్చారు. అడుగడుగునా వైసీపీని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. విజయసాయిరెడ్డి రావడంపై బీజేపీ కూడా తీవ్ర నిరసన తెలిపింది. రామతీర్థం వద్ద బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌, శ్రీనివాసానంద బైఠాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories