Vizag Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హార్బర్ భద్రత‌పై అధికారుల దృష్టి

Authorities Focus On Visakha Fishing Harbor Security
x

Vizag Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హార్బర్ భద్రత‌పై అధికారుల దృష్టి 

Highlights

Vizag Fishing Harbour: హార్భర్ నిర్వహణ పోర్టు అధారిటీకి అప్పగించే ఆలోచన

Vizag Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హార్బర్ భద్రత పై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలుపై నివేదిక సిద్ధమైంది. ఇంతకీ నివేదిక లో ఏముంది.. హార్బర్ భద్రత పై చేయబోతున్న ఎలాంటి సిఫార్సులు చేయబోతోంది.

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన పై ప్రభుత్వం వేసిన ఫైవ్ మన్ కమిటీ నివిదిక సిద్ధం చేసింది. ఇక నుంచి హార్బర్ నిర్వహణ పూర్తి గా విశాఖ పోర్టు ఆధారిటీకే అప్పగించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అగ్ని మాపక శాఖ సూచనలతో హార్బర్ ని నో స్మోకింగ్ జోన్ గా ప్రకటించనున్నారు. మండే స్వభావం ఉన్న ఏ వస్తువులు హార్బర్ లో వినియోగించకుండా చర్యలు తీసుకోలనే నివేదికలో పేర్కొనే అవకాశం ఉంది. .బొట్ల లో వంట గ్యాస్ వినియోగం పై కూడా నిషేధం విధిస్తున్నారు.

అలాగే పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం, 24 గంటల పెట్రోలింగ్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక నుంచి ఫిషింగ్ హార్బర్ లోకి ఎవరు రావాలన్న ప్రత్యేక పాస్ లు జారీ చేస్తారు. సీసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిబంధనలు పై మత్స్యకార సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

నిత్యం చేపల రేవు కి వ్యాపార కార్యకలాపాల కోసం 4 వేల మందికి పైగా వస్తుంటారు. వారికి పర్మినెంట్ పాస్ లు. సందర్శకుల కి తాత్కాలిక పాస్ లు ఇవ్వనున్నారు. మత్స్య శాఖ కార్యాలయం లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి హార్బర్ భద్రత పర్య వెక్షించనున్నరు. అయితే ఇదంతా పూర్తి స్థాయి నిబంధనలు అమలు చేయడానికి కొంత సమయం పట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories