Vizianagaram: విజయనగరం జిల్లాలో కంటైన్మెంట్ జోన్ ప్రకటించిన అధికారులు

*దత్తిరాజేరు మండలం వంగర గ్రామం కంటైన్మెంట్ జోన్ గా ప్రకటన * గ్రామాన్ని శానిటైజ్ చేస్తున్న అధికారులు

Sandeep Reddy
Updated on: 25 Aug 2021 6:00 PM IST
Authorities Declared the Containment Zone in Vizianagaram District
X

విజయనగరం జిల్లాలో కంటైన్మెంట్ జోన్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Vizianagaram: విజయనగరం జిల్లాలో కరోనా కేసులు కలవరం సృష్టిస్తున్నాయి. తాజాగా దత్తిరాజేరు మండలం వంగర గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. గ్రామంలో కరోనా కేసులు అధికం కావడంతో వైద్య ఆరోగ్యశాఖ నివేదికతో అధికారులు కంటైన్మెంట్ జోన్ నిర్ణయం తీసుకున్నారు. గ్రామానికి రెండు వందల మీటర్ల వరకు కంటైన్మెంట్ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. గ్రామం మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. ఇదే గ్రామానికి సమీపంలోని కె.కొత్తవలస బఫర్ జోన్ గా ప్రకటించారు. ప్రతీ ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story