Eluru: ఏలూరు జిల్లా రాయుడుపాలెంలో దారుణం.. రాంబాబుపై కత్తులతో ఇద్దరు వ్యక్తుల దాడి

Eluru: రాంబాబుకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Shekhar G
Published on: 17 Aug 2023 9:12 AM IST
Atrocity In Rayudupalem Of Eluru District
X

Eluru: ఏలూరు జిల్లా రాయుడుపాలెంలో దారుణం.. రాంబాబుపై కత్తులతో ఇద్దరు వ్యక్తుల దాడి

Eluru: ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయుడుపాలెంకు చెందిన పెనుబోయిన రాంబాబుపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. విజయరాయికి చెందిన లక్ష్మణరావు మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి...బుధవారం రాత్రి ఇంటి ముందు ఉన్న రాంబాబుపై కత్తులతో దాడి చేశారు. రాంబాబుకు లక్ష్మణ్‌రావు మేనల్లుడు. అయితే వీరిద్ధరికి పాత గొడవల నేపథ్యంలో కేసులు ఉండటంతో.. కోర్టుకు కూడా వెళ్లారు. పాతకక్షల కారణంగా.. ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. క్షతగాత్రునికి ప్రాథమిక వైద్యం అందించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story