ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదల..

Atmakur Bypoll Schedule Released
x

ఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదల..

Highlights

Election Commission: దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు..

Election Commission: దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఆత్మకూరు ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆత్మకూరు అసెంబ్లీ స్థానికి ఈనెల 30 నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలుకు జూన్‌ 6 వరకు గడువు విధించింది. జూన్‌7న నామినేషన్ల పరిశీలన, జూన్‌ 9 వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. 26న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories