ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు!

Arun Chilukuri
Published on: 22 Sept 2020 2:31 PM IST
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు!
X

ఏపీ టీడీపీ కొత్త కమిటీని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన కసరత్తు పూర్తయింది. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైనట్టు సమాచారం. ఈ నెల 27న అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో మళ్లీ బీసీ అయినటువంటి అచ్చెన్నాయుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు పార్టీ కొత్త కమిటీలను కూడా చంద్రబాబు ప్రకటించనున్నారు. ఇటీవల అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాం లో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 70 రోజులు జైల్లో ఉన్న ఆయన బెయిల్ పై బయటికి వచ్చారు. మరోవైపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని టీటీడీపీ సీనియర్లు చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, దీనికి సంబంధించి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story