Gummalakshmipuram: ఎల్విన్ పేట జంక్షన్ చెక్ పోస్ట్ ని ఆకస్మిక తనిఖీ చేసిన ఓఎస్డీ, ఎఎస్పీ

గుమ్మలక్ష్మీపురం: మండలం ఎల్విన్ పేట జంక్షన్ వద్ద గల ఆంధ్ర, ఒరిస్సా చెక్ పోస్ట్ ను ఓఎస్డీ రామ్మోహన్ రావు, ఏఎస్పీ గరికిపాటి బిందు మాధవవ్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

Swathi Adulapuram
Published on: 27 April 2020 3:31 PM IST
Gummalakshmipuram: ఎల్విన్ పేట జంక్షన్ చెక్ పోస్ట్ ని ఆకస్మిక తనిఖీ చేసిన ఓఎస్డీ, ఎఎస్పీ
X

గుమ్మలక్ష్మీపురం: మండలం ఎల్విన్ పేట జంక్షన్ వద్ద గల ఆంధ్ర, ఒరిస్సా చెక్ పోస్ట్ ను ఓఎస్డీ రామ్మోహన్ రావు, ఏఎస్పీ గరికిపాటి బిందు మాధవవ్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. గుమ్మలక్ష్మీపురం శ్రీకాకుళం జిల్లా ఆనుకొని ఉందని చాలా జాగ్రత్తగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని విజయనగరం జిల్లాలోకి ఎట్టి పరిస్థితిలో వేరే జిల్లా వాళ్ళు ప్రవేశించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరోనా మహమ్మారిని మన జిల్లాకి రాకుండా అన్ని విధాల శాయ శక్తులా కృషి చేస్తున్నామని అన్నారు. మాతో పాటు ప్రజలు కూడా కొత్త వారు మీ గ్రామానికి వస్తే మా పోలీస్ సిబ్బందికి తెలియజేయగలరని అన్నారు.

ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించాలని ఎప్పటికి అప్పుడు అన్ని శాఖల అధికారులతో వివరాలు సేకరిస్తున్నామని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి అని, సామాజిక దూరం పాటించాలని తెలియజేశారు. ఈయన వెంట పార్వతీపురం ఏఎస్పీ గరికిపాటి బిందు మాధవ్, ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, ఎస్ఐ నారాయణరావు, వారి సిబ్బంది పాల్గొన్నారు.

Swathi Adulapuram

Swathi Adulapuram

Next Story